వెల్దుర్తి గ్రామ నాయకుడు ఎన్ఆర్ఐ ఈ.ఎల్. అనిల్ కుమార్ గౌడ్
వెల్దుర్తి న్యూస్ వెలుగు : వెల్లుర్తి మండల అభివృద్ధి ఎన్నారైల తోనే సాధ్యమని వెల్దుర్తి గ్రామ నాయకుడు ఎన్ఆర్ఐ ఈ ఎల్ అనిల్ కుమార్ గౌడ్ అన్నారు మండలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మండలంలో ఉన్న ఉభయ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో వెల్దుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలన్నారు. ఆదివారం తన నివాసంలోనే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా కుటుంబాలు 50 సంవత్సరాలు నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడంతో నేను కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరుగుతుందన్నారు నేను తిరుపతిలో విద్యార్థి నాయకుడిగా పనిచేసి సీఎం చంద్రబాబుతో ఎన్నో ప్రశంసలు పొంది ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని గతంలోనే పిలుపునియ్యడం జరిగిందన్నారు.

మా కుటుంబంలో పదిమంది విదేశాలకు వెళ్లి NRI లు గా ఎన్నారైలుగా స్థిరపడి సొంత గడ్డ అయిన అయిన వెల్దుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు వెల్దుర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా చేకూర్చి గ్రామ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి యువతకు ఆర్థిక భరోసా ఇస్తామన్నారు. నేను వెల్లుర్తిలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేయడం జరుగుతుందన్నారు ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు తావు లేకుండా కృషి చేస్తానన్నారు తన సొంత నిధులతో ప్రజలకు సేవ చేసి గ్రామంలోని చదువుకున్న యువతకు ఉచిత ఏర్పాటు చేసి డిజిటల్ లైబ్రరీని ప్రతి రెండు వార్డులలోని యువతకు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు ముఖ్యంగా వెల్దుర్తి పట్టణంలో పాత బస్టాండ్ లో ఉన్న ట్రాఫిక్ సమస్యను షాపుల యజమానులతో మాట్లాడి పరస్ఫర అంగీకారంతో కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు పాత బస్టాండ్ లో సకల సదుపాయాలతో బస్టాండ్ ఏర్పాటు చేస్తామని అలాగే గ్రామంలో ప్రజలకు పార్కులను ఏర్పాటుతోపాటు గ్రామంలోని అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించి శాశ్వత భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేసి పంచాయతీ బోర్డులో కొళాయి ఇంటి నిర్మాణాలకు ఇటువంటి లంచాలకు తావు లేకుండా పనిచేస్తామన్నారు.
Thanks for your feedback!