
కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
ఉప్పర్లపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ
తుగ్గలి, న్యూస్ వెలుగు; కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప్పర్లపల్లి గ్రామ టిడిపి నాయకులు అప్పా వేణు తెలియజేశారు.బుధవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శాంబాబు ఆదేశాల మేరకు మండల పరిధిలోని గల ఉప్పర్లపల్లి గ్రామం నందు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమాన్ని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించగా గ్రామ సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా గ్రామ టిడిపి నాయకులు అప్పా వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందన్నారు.రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులైన అవ్వ తాతల పెన్షన్ 4000,వికలాంగుల పెన్షన్ 6000, రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, నిరుద్యోగులైన యువతకు బంగారు భవిష్యత్తుకు మెగా డీఎస్సీ,ప్రజల సొంత భూమి స్టిరాస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,విజయవాడ లోని వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయడంతో పాటు మరో సంక్షేమ పథకాలను అందించేందుకు మన ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.కేంద్రంలోను మరియు రాష్ట్రంలోను ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ఈ ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వంద రోజులుగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గ్రామ ప్రజలకు వారు వివరించి, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నీలా మనోహర్,అప్పా జగన్,సుంకప్ప, శ్రీరాములు,ఈశ్వరయ్య, విశ్వనాథ్, కంబగిరి,రాము నాయక్,పశు వైద్యాధికారిని ప్రణీత,సచివాలయ సిబ్బంది,ఏఎన్ఎం లు,గ్రామ టిడిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.