
ఘనంగా రథోత్సవ వేడుకలు తరలి వచ్చిన భక్తులు
కర్నూలు న్యూస్ వెలుగు : హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో శరణసిద్దేశ్వరస్వామి , గాలింగేశ్వర స్వామి జోడు రథోత్సవం నేత్రనందంగా జోరుగా సాగింది . ఆదివారం ఉదయం నుంచి స్వామి గురువైన శరణసిద్దేశ్వరుడికి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదవతి నుంచి తెచ్చిన జలంతో అభిషేకం చేశారు . స్వామికి ఆకుల పూజ,గంగపూజలు జరిపి దేవాలయన్ని పూలతో అలంకరించారు.సాయంత్రం 6గంటలకు దేవాదాయశాఖ కార్యదర్శి రాధాకృష్ణ, రెడ్డి రఘనందనగౌడు,కరుణం రాఘవేంద్రరావు రథచక్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు కుంభోత్సవంతో మొక్కుబడుల తీర్చుకున్నారు. వేంటనే వేదపండితులు మంత్రాలు వల్లీంస్తూండగా శ్రీ శరణగాదిలింగేశ్వరస్వామి నామస్మరణంతో మారుమోగింది. ప్రధాన వీధుల్లో ఇసుకేస్తే రాలనంత జనం మధ్యలో రథోత్సవాలను లాగారు.జోడు రథాలు ఒకే సారి కదిలి రావడంతో వీనుల విందుగా మారింది.

Was this helpful?
Thanks for your feedback!

