
నియంత పాలన కాంగ్రెస్లో కుదరదు..
నియంత పాలన.. కాంగ్రెస్లో కుదరదు.
* యువతకు అవకాశం ఇస్తే దోచేస్తారా..?
* నిధుల లెక్క తేలాల్సిందే.
* పార్టీ కార్యాలయం పై బీజేవైఎం దాడి చేస్తే స్పందించరా..?
* కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసనకు దిగిన కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి, నాయకులు
కర్నూల్ న్యూస్ వెలుగు :కాంగ్రెస్ పార్టీలో నియంత పాలన కు అవకాశం లేదని.. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్రాంతి నాయుడుకు వ్యతిరేకంగా నాయకులు
సయ్యద్ నవీద్ , సుంకన్న, కాసింలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై బీజేవైఎం కార్యకర్తలు దాడి చేస్తే కూడా స్పందించని నాయకత్వం మాకు అవసరమా అంటూ నిలదీశారు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందరికో భవిష్యత్తు ఇచ్చిన పార్టీ అని.. అలాంటి పార్టీ ఆఫీసుకు యువత కు తొలిసారి ప్రాధాన్యమిస్తే.. డిసిసి పీఠంలో కూర్చుని అవినీతి అక్రమాలకు పాల్పడతాన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాలను సంబంధించి మధ్య ద్వారా సమకూరుతున్న నిధులను సొంత ఖాతాలోకి మళ్ళించుకుని పార్టీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పైగా లెక్కలు అడిగితే మీకు చూపించాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను ధిక్కరించే సమాధానాలు చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో నెహ్రు మహాత్మా గాంధీ అంబేద్కర్ ఇలాంటి మహనీయుల ఫోటోలు పెడితే వాటిని తొలగించి కొండారెడ్డి బురుజు ఫోటో ఎలా పెడతారు అంటూ మండిపడ్డారు.. ప్రజల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతుంటే ఇక్కడ మాత్రం నియంత పాలన సాగిస్తే కుదరదని హెచ్చరించారు. సోమవారం ఉదయం గ్యాస్ పెరిగిన ధరలకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం ఉందని తెలపడంతో మంది మార్బలంతో నియోజకవర్గం చూస్తే ఇక్కడ నిరసన వాయిదా వేసామని చెబుతున్నారని, పైగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే కేసులు బనాయిస్తారని ఓ డిసిసి స్థాయి వ్యక్తి చెప్పడం ఎంతవరకు సమంజసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేవైఎం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై దాడి చేస్తే బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తన చిన్ననాటి స్నేహితుడని ఆయన వ్యతిరేకంగా కేసులు నమోదు చేసే అంత అవసరం తనకు లేదని డిసిసి తెగేసి చెప్పడం కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. గత 11 నెలల కాలంలో డిసిసి లేని సమయంలో పార్టీ కార్యాలయానికి సంబంధించి 19 వాణిజ్య సముదాయాల ద్వారా సమకూరుతున్న డబ్బును ఖాతాలోకి జమ చేస్తే.. ప్రస్తుత డిసిసి వాటిని తన సొంత ఖాతాలోకి మళ్ళించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వెంటనే అధిష్టాన స్పందించి ఈయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

