
దివ్యాంగులు విజయ సారధులే
డిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బి సి నాగరాజు కు ఘనంగా సన్మానం
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సునాయిన ఆడిటోరియం లో జరిగిన 65వ “ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం” కార్యక్రమాన్ని జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, మొదట ఈ కార్యక్రమాన్ని రాజ్ విహార్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు దివ్యాంగులందరూ ర్యాలీగా తరలివచ్చి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ మాట్లాడుతూ దివ్యాంగులు సాధించలేని విజయాలు అంటూ ఏమీ లేవని ముఖ్యంగా తగిన ప్రోత్సాహం, చేయూత అందిస్తే ఎన్నో రంగాల్లో అద్భుతమైన విజయ అవకాశాలు సాధిస్తారని ఉద్ఘాటించారు, కార్యక్రమంలో దివ్యాంగుల సాధికారిక కోసం విశేష కృషి గావించినటువంటి రాష్ట్ర “దివ్యాంగుల సాధికారత ఫోరం” డిఈఎఫ్ అధ్యక్షులు బి సి నాగరాజు అదేవిధంగా పలువురు దివ్యాంగులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఘనంగా సన్మానించారు,