ప్రారంబించనున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టి.జి.భరత్
కర్నూలు, న్యూస్ వెలుగు; తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ రెండు లక్షల “మానవులందరికీ భగవద్గీత” ఉచిత

పుస్తక ప్రసాద వితరణ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్ గారిచే ఇండస్ మంటిస్సోరి విద్యాలయాలలో ఉదయం 9 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.ఈ అవకాశాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులకు ఆయా పాఠశాల యజమానులు ప్రధాన ఆచార్యులు ఉపయోగించుకోవచ్చు అని పిలుపునిచ్చారు.
Thanks for your feedback!