ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

న్యూస్.వెలుగు, ఒంటిమిట్ట; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొండ మాచుపల్లి గ్రామానికి చెందిన చింత గింజల. శకుంతల అనే మహిళ గత కొద్ది రోజుల కిందట రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని అర్హతలు కలిగిన బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 23,920 రూపాయలు డబ్బు కేటాయించడం జరిగింది. ఈ సహాయ నిధిని చెక్కు ద్వారా శనివారం తన పార్టీ కార్యాలయంలో ఇన్చార్జి సుబ్రమణ్యం బాధిత కుటుంబానికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలకతీతంగా పనిచేస్తూ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటూ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర పాలన చేస్తున్నాడని పేద బడుగు బలహీన వర్గాలు అందరిని నిష్పక్షపాతంగా చూసుకుంటూ తమ కష్టసుఖాల్లో నేనున్నానంటూ భరోసా కలిగిస్తున్నాడని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశాడు.

Author

Was this helpful?

Thanks for your feedback!