25 శాతం రాయితీ తో శనగ విత్తనాలు పంపిణీ

 25 శాతం రాయితీ తో శనగ విత్తనాలు పంపిణీ

ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలంలోని నల్లబల్లె గ్రామ సచివాలయం లో రభి 2024.2025 సీజన్ కు సంబంధించి శనగ విత్తనాలు రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు చెల్లించిన రైతులకు గ్రామ సర్పంచ్ జి. రామారెడ్డి , యమ్.పి.టి.సి.మెంబర్ ఓ.చలమా రెడ్డి, గ్రామ టిడిపి నాయకుడు జి.బాబుల్ రెడ్డి  ఆధ్వర్యంలో శనగ బస్తాలు ను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడమే తమ వంతు బాధ్యత అన్నారు.నల్లబల్లె గ్రామంలో 156 మంది రైతులకు 221 క్వింటాల్సును పంపిణీ చేసినట్లు తెలిపారు.25 శాతం రాయితితో విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.విత్తనాలు తీసుకున్న ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఎవరైనా దుర్వినియోగం చేస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు విత్తనం వేసేటప్పుడు తప్పనిసరిగా విత్తనశుద్ది చేసుకోవాలని కోరారు.విత్తనశుద్ది చేసుకుంటే చీడ పీడలు రాకుండా పంటను కాపాడుకోవచ్చును అని తెలిపారు. ట్రైకోడెర్మావిరిడీ అనే పొడి ని కిలో విత్తనాలకు 10 గ్రాములు పట్టించి లేదా హెక్సాకొనజోల్ అనే మందును కిలో విత్తనానికి 2 యమ్.యల్.లేదా సాఫ్ ( కార్బన్డిజం+ మ్యాంకోజబ్)అనే మందును 2.5 గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకుంటే వేరు కుళ్లు తెగులు, ఎండు తెగులు రాకుండా మంచి ఫలితం ఉంటుంది అని తెలిపారు. రైతుకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయడమే తమ లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.యస్.కె.సిబ్బంది బి.గంగయ్య,యస్.వెంకట రమణ ,యన్.రామ సుందర్ రెడ్డి మరియు గ్రామ రైతులు ,పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!