రాయితీ తో రైతులకు విత్తనాల పంపిణీ

రాయితీ తో రైతులకు విత్తనాల పంపిణీ

  ముద్దనూరు న్యూస్ వెలుగు : ముద్దనూరు మండలంలోని కె.తిమ్మాపురం గ్రామంలో రైతులకు ఉచితంగా విబియన్ 8 రకం మినుము విత్తనాల ప్యాకెట్లను మండల టిడిపి ఇంచార్జి చింతా శివ రామిరెడ్డి చేతుల మీదుగా రైతులకు అందించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సి.శివ రామిరెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ద్వారా అమలు చేసే అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి యమ్.వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 79 మంది రైతులకు డి క్రిష్ యాప్ ద్వారా బయోమెట్రిక్ వేయించి రైతులకు ఉచితంగా మినుము ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!