దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు పంపిణీ

దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు పంపిణీ

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం సర్పంచ్ చలు వాది రంగమ్మ,మండల వైస్ ఎంపిపి సింధువాలం గాదేమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ సుహాసినమ్మ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడిఐపి పథకం కింద ఆస్పిరేషన్ బ్లాక్ లో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిల్  బ్యాటరీ స్కూటర్,వీల్ చైర్లు తదితర పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని డిఎల్డివో  మండల ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు హాజరయ్యారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి నాగేశ్వర రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు పంపిణీ చేస్తున్న ఈ పరికరాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 13 మందికి వీల్ చైర్లు,16 మందికి బ్యాటరీ ట్రై సైకిల్,47 మందికి ట్రై సైకిల్స్, స్టిక్స్ తదితర వాటితో కలిపి 33 రకాల పరికరాలను 140 మందికి అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్,మండల నీతి అయోగ్ అధికారి రవిశంకర్,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,ఎంపిపి తనయుడు ఈసా,వైస్ ఎంపిపి తనయుడు కెంచప్ప,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,సర్పంచులు మౌలాలి,శేషన్న,వీరుపాక్షి రెడ్డి,నాగప్ప నాయుడు,ఎంపిటిసిలు శివన్న,ఆచారి,షేక్షవలి,మంజు నాయక్,కూటమి నాయకులు పంపాపతి,పిరాన్న,తోక వెంకటేష్,దిడ్డి వెంకటేష్,దుర్గ ప్రసాద్,అశోక్,మోహిన్,అబ్దుల్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!