జాతీయస్థాయి సబ్ జూనియర్ ఉషూ పోటీలలో పాల్గొంటున్న జిల్లా క్రీడాకారులు
రాజ్యసభ మాజీ సభ్యులు టీ జీ వెంకటేష్
న్యూస్ వెలుగు, కర్నూలు; నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో 22వ జాతీయస్థాయి సబ్ జూనియర్ ఉషూ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు ఎస్ఎండి సాద్ భాషా, ఎం పవన్, ఎస్ఎండి జాద్ బాషా ఈరోజు మౌర్య ఇన్ ఆఫీస్ నందు అభినందన కార్యక్రమం జరిగింది రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ ఎంపికైన క్రీడాకారులకు అభినందిస్తూ ఉషూ క్రీడాకారులు మన జిల్లాకు జాతీయస్థాయిలో పథకాలు సాధించాలని అన్నారు అనంతరం జాతీయస్థాయిలో పాల్గొంటున్న ఉషూ క్రీడాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు జిల్లా ఉషూ సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు తెలిపారు
Was this helpful?
Thanks for your feedback!