
నూతన సంవత్సర వేడుకలకు జిల్లా కాంగ్రెస్ దూరం
2న మన్మోహన్ సింగ్ సంతాప సభ
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ
న్యూస్ వెలుగు, కర్నూలు; జనవరి 1న నూతన సంవత్సర వేడుకలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ దూరంగా ఉంటుందని ఎలాంటి వేడుకలు ఆర్భాటాలు జరుపుకోవడం లేదని అలాగే జనవరి రెండవ తేదీ భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమం ఉంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పి మురళీకృష్ణ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మురళీకృష్ణ మాట్లాడుతూ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి ఒకటో తేదీ వేడుకలు జరుపుకోవడం లేదని ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు గుర్తించాలని అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నందు జనవరి 02-01-2025 వ తేదీ ఉదయం 11: 00 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమమునకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరు కావలసిందిగా పి మురళీకృష్ణ గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar