
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ వి.రత్న
పుట్టపర్తి, న్యూస్ వెలుగు;శ్రీ సత్య సాయి జిల్లా ప్రజలకు జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు,పాత్రికేయులకు జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ దీపావళి వేడుకలతో అందరి జీవితాల్లో వెలుగులు రావాలని, చీకట్లను పారదోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులతో వీర జిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణ సంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండి ఈ దీపావళి వేడుకలు జరుపుకోవాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Chandra
 Journalist Chandra