
ఆరోగ్య సంరక్షణలో వైద్యులదే కీలక పాత్ర
అమరావతి (న్యూస్ వెలుగు ): ఆరోగ్య సంరక్షణలో వైద్యులు కీలక పాత్రపోషిస్తున్నారని ఆంధప్రదేశ్ రాష్ట్రగవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేతయ్య కళాక్షేతంలోమంగళవారం నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదన్నారు. అటువంటి ఈ వృత్తిలో ఎంపికైన వైద్య విద్యార్ధులు ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు.
వైద్యరంగానికి రాష్ట్రపభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని తెలిపారు. రాష్టంలో ఉన్న 34 వైద్య కళాశాలలతో పాటు,
అల్లూ రి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజన ప్రాంతంలో ఒక నూతన వైద్య కళాశాలను పభుత్వం
ప్రారంభించిందన్నారు. విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ లో అనస్థీషియాలజీ,
రేడియేషన్ ఆంకాలజీ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
