5 ఎక్స్రే డిజిటల్ క్యాసెట్లు (CR) విరాళం పూర్వ పీజీ విద్యార్థులు

5 ఎక్స్రే డిజిటల్ క్యాసెట్లు (CR) విరాళం పూర్వ పీజీ విద్యార్థులు

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి  మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీ రేడియాలజీ విభాగపు పూర్వ పీజీ విద్యార్థులు, కర్నూలు రేడియాలజీ వైద్యుల సంఘం రెండు లక్షల 50 వేల రూపాయలు విలువగల ఫ్యూజి కంపెనీకి చెందిన 5 ఎక్స్రే డిజిటల్ క్యాసెట్లు (CR) విరాళం అందజేసినట్లు తెలిపారు.రేడియాలజీ విభాగంలో క్యాసెట్ల కొరత ఉందన్న విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్  వెంటనే రేడియాలజీ పూర్వపు విద్యార్థులతో మాట్లాడి వారి సహకారంతో ఎక్స్రే డిజిటల్ క్యాసెట్లు ను డొనేషన్ రూపంలో ఆసుపత్రి రేడియాలజీ విభాగానికి అందజేసినట్లు తెలియజేశారు.ఆసుపత్రి రేడియాలజీ విభాగంలో ఎక్స్రే క్యాసెట్ల కొరతను అధిగమించి ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సౌకర్యార్థం వాటికి ఉపయోగించనున్నట్లు తెలియజేశారు. వీటి వలన పేషెంట్లకు ఎక్స్రేలు మరింత తొందరగా తీయడానికి వీలవుతుంది.. ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన రేడియాలజీ పూర్వపు పీజీ విద్యార్థులు మరియు రేడియాలజీ పూర్వపు వైద్యులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఇంకొంతమంది వైద్యులు స్పూర్తిగా తీసుకొని పీడియాట్రిక్ మరియు గైనకాలజీ విభాగంలో కొన్ని పరికరాలు  వసతుల కల్పనకు ముందుకు రావలసిందిగా పూర్వ విద్యార్థులను  కోరారు. విరాళాలు అంటే పెద్ద పెద్ద మొత్తంలోనే కాకుండా చిన్న చిన్న మొత్తంలో మనకు ఏవైతే పనికి వస్తాయో వాటిని ప్రజలకు అందించడం ద్వారా మనం చదువుకున్న ఆసుపత్రి యొక్క రుణం తీర్చుకున్న వారు అవుతారు అని తెలిపారుఈ కార్యక్రమానికి రేడియాలజీ విభాగపు వైద్యులు, హెచ్ ఓ డి, డా.పద్మాలత, ప్రొఫెసర్, డా.రాధారాణి, అసోసియేట్ ప్రొఫెసర్, డా.హరినాథ్, కర్నూలు వైద్య కళాశాల రేడియాలజీ పూర్వ వైద్యులు, డా.జోజి రెడ్డి, డా.సురేష్, డా.విజయ్ కుమార్, డా.రవికుమార్ సమన్, డా.మహేష్ యాదవ్, డా.అశోక్, డా.రవితేజ, డా.హనీఫ్,  ఆసుపత్రి ARMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, చీఫ్ రేడియో గ్రాఫర్, రామ్ సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS