అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదు : జాయింట్ కలెక్టర్

అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదు : జాయింట్ కలెక్టర్

పుట్టపర్తి, న్యూస్ వెలుగు: పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో.. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసితోపాటు డిఆర్వో సూర్యనారాయణ రెడ్డి, పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, ఎస్ డి సి రామసుబ్బయ్య హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ….ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో సత్వరం పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డులు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్ ల మంజూరు తదితర అంశాలతో కూడిన వినతులను సమర్పించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా.. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని..*
(1) గోరంట్ల మండలం తాటిమాగులపల్లి వానవోలు కు చెందిన వెంకట నారపరెడ్డి.. తన పొలానికి 1బి అడంగల్ పాస్ పుస్తకం మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు.
(2) ముదిగుబ్బ మండలానికి చెందిన రమాదేవి… తన రేషన్ కార్డులోని తప్పులను సరిచేసి నూతన రేషన్ కార్డు మంజూరు చేయవలసిందిగా అర్జీ సమర్పించారు.
ఈ రోజు కార్యక్రమంలో మొత్తం 93 అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్కరించు నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు జేసి ఎండార్స్ చేయడం జరిగింది

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS