డబల్ వాల్వ్ రీప్లేస్మెంట్- MICS ద్వారా 6 cm చిన్నకోతలో క్లిష్టమైన బైపాస్ ఆపరేషన్

డబల్ వాల్వ్ రీప్లేస్మెంట్- MICS ద్వారా 6 cm చిన్నకోతలో క్లిష్టమైన బైపాస్ ఆపరేషన్

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె,  ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

అనస్తీసియా బృందం సభ్యుల కొండారెడ్డి టీం,  సర్జరీ టీం డాక్టర్ రవీంద్ర పర్ఫ్యూజనిష్టు సహకారం 

న్యూస్ వెలుగు, కర్నూలు; గిడ్డయ్య అనే 31 ఏళ్ల వయసు, మునగాల గ్రామం గూడూరు మండలం కర్నూలు లో ఉన్న వ్యక్తికి ఓ కష్టం వచ్చింది.. అతని గుండెలో ఉండే రెండు కవాటాలు అంటే మైట్రల్ మరియు అయోర్టిక్ కవాటాలు రెండు చెడిపోయాయి.. వాటిని రెండు మార్చవలసి వస్తుంది.. రెండు కవాటాలు ఒకే సిట్టింగ్లో మార్చడం అనేది చాలా పెద్ద ఆపరేషన్ ఇది చాలా ఖరీదు తో కూడుకున్నది..ఈ ఆపరేషన్ కు ఎన్టీఆర్ వైద్య సేవలో రెండు లక్షల రూపాయల ప్యాకేజీ ఉంటుంది అయినా కాని ఈ ఆపరేషన్లు ఎంతో కొంత లేనిదే బయట చేయరు.. ఎందుకంటే ఖర్చులు అలా ఉంటాయి. చాలా రిస్కు ఉంటుంది.
అంతేకాక ఈ పేషెంట్ కు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కూడా లేదు. కార్డు కూడా లేక డబ్బులు లేకుండా ఉన్నప్పుడు ఇక అతనికి ఆపరేషన్ అనేది కలలో మాటే.. అతను చాలామందిని అడిగాడు కానీ ఎవరు పలకలేదు.. చివరికి ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూల్ కు వచ్చాడు.. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలాగైనా ఇతనికి ఆపరేషన్ చేయాలి.. మంచిగా చేయాలి ఎందుకంటే చాలా చిన్న వయసు కష్టపడి పని చేసుకోవాలి కావున ఎలాగైనా ఇతనికి ఆపరేషన్ చేయాలా అని అనుకున్నాను.. కానీ అతను ఏమాత్రం డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి…మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ ఫారంకు CMCO కు అప్లై చేశాం.. గౌరవ ముఖ్యమంత్రి ఆఫీస్ వారు దీనికి రెస్పాండ్ అయ్యారు.. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు లేకపోయినప్పటికీ అతను బీదవాడు అని నిర్ధారించే సర్టిఫికెట్లు పెట్టడం వల్ల అతనికి వెంటనే అప్రూవల్ ఇచ్చారు.. కానీ అతను పని చేసుకోవలసిన వయసు కావున ఎముక కట్ చేస్తే అతను చాలా రోజులు పని చేసుకోలేడు మరియు సిక్ గా అయిపోతాడు అని భావించి అతనికి ఎం ఐ సి ఎస్ MICS చిన్న కోత పద్ధతిలో రెండు వాల్వులు రీప్లేస్మెంట్స్ చేద్దాము అని అనుకున్నాము.. కానీ చాలామంది పెద్దపెద్ద ఆసుపత్రిలో కూడా ఏదో ఒక వాల్వు అయితే రీప్లేస్మెంట్ చేశారు తప్పితే రెండు వాల్వులు ఒకే సిట్టింగ్లో రీప్లేస్మెంట్ చేయడం చాలా తక్కువగా ఉన్నట్లు మేము గమనించాం.. అంతేకాకుండా మొన్న షెరటాన్ కాన్ఫరెన్స్లో కూడా చాలామంది సింగిల్ వాల్వే చేశాము అని చెప్పారు..నేను ఇంతకుముందే ఇటువంటి ఆపరేషన్ మూడు సంవత్సరాల కింద చేసి ఉండడం వల్ల ఇతనికి కూడా మరలా చేద్దాము అని అనిపించింది కాకపోతే ఇది చాలా ప్రయాసతో కూడుకున్న పని ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది.. మరియు రిస్క్ తో కూడుకున్న పని అసలే డబుల్ వాల్వు రీప్లేస్మెంట్ అంటేనే రిస్క్ మరియు అది చిన్న కోత ఆపరేషన్లు చేయాలంటే ఇంకా రిస్క్..సరే మనం ఒకరోజు కష్టపడితే అతని జీవితాంతం సుఖంగా పని చేసుకుంటూ ఉంటాడు కదా అని ఆలోచించి అతనికి ఆపరేషన్ చేయడానికి మేము తయారయ్యాం.. మా అనస్తీసియా బృందం సభ్యుల కొండారెడ్డి మరియు వాళ్ళ టీము మరియు మా సర్జరీ టీం డాక్టర్ రవీంద్ర పర్ఫ్యూజనిష్టు మరియు సిస్టర్స్ అందరూ కూడా దీనికి వెంటనే ఆమోదం తెలిపారు.. ఈ ఆపరేషన్ రెండు వాల్వ్లు రిప్లేస్ చేయాలంటే చిన్నకోత పద్ధతిలో పది లక్షల రూపాయలకు తక్కువ తీసుకోరు మేము దీనిని మామూలు ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజీ రెండు లక్షల లోనే చేయడానికి రెడీ చేసుకున్నాం.. ఏదేశంలో కూడా ఇంత తక్కువ డబ్బులలో ఈ ఆపరేషన్ చేయలేరు..నాలుగు బాటిల్ల రక్తము మరియు ఇతర వాల్వులు అన్నీ కూడా చకచకా రెడీ చేసుకున్నాము.. నిన్న 11/12/2024 న ఆపరేషన్ చేశాను.. ఇందులో ఛాతి పైన ఆరు సెంటీమీటర్ల కోత ఉంటుంది.. స్టెర్ణం ఎముకను కట్ చేసేది ఉండదు. ఇతనికి బైపాస్ చేసేకి కాలు దగ్గర గజ్జలలో ఉండే రక్తనాళాల నుంచి బైపాస్ పైపులు ప్రవేశపెట్టి బైపాస్ మిషన్ కు కనెక్ట్ చేస్తాం.. ఆపరేషన్ 6 గంటల సమయం పట్టింది ఆపరేషన్ లో ఒక మైట్రల్ కవాటము మరియు అయోర్టిక్ కవాటము రెండిటిని కూడా మార్చి వేయడం జరిగింది.. రెండిటి స్థానంలో ప్లాస్టిక్ కవాటాలను అక్కడ పెట్టడం జరిగింది..
ఆపరేషన్ లో బ్లడ్ లాస్ చాలా తక్కువగా ఉంది మరియు పేషెంట్ ఈ రోజు ఉదయం కల్లా రికవరీ అయిపోయి వెంటిలేటర్ కూడా తీసేసాము.. పేషెంట్ ఈరోజు బాగా మాట్లాడుతూ ఉన్నాడు తొందరగా కోలుకుంటూ ఉన్నాడు.. చిన్న కోత ఆపరేషన్ లో అడ్వాంటేజ్ ఏంటంటే పేషంట్ తొందరగా కోలుకుంటాడు.. రక్తం లాస్ తక్కువగా ఉంటుంది మరియు నొప్పి చాలా తక్కువగా ఉంటుంది.. మరుసటి రోజు కల్లా మామూలుగా లేచి కూర్చోగలడు.. కాని నాకే ఇంకా ఒళ్ళు నొప్పులు తగ్గలేదు.. మనం అబ్నార్మల్ పొజిషన్లో చేయడం వలన మెడ నొప్పి మరియు నడుము నొప్పులు వస్తాయి.. ఏదేమైనా రోగి తొందరగా కోసుకుంటే ఆ ఆనందం ఫీలింగ్ వైద్యులకు టానిక్ లాగా పనిచేస్తుంది..
కాకపోతే 9 /12/2024 న 13 సంవత్సరాల బాలునికి గుండెలోని రంద్రాని కూడా ఇటువంటి ఆపరేషన్ చేయడం ఆ పేషెంట్ 3 రోజులలో కోలుకోవడం కూడా మా బృందానికి చాలా సంతృప్తినిచ్చింది
ఈ సౌకర్యం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ని CTVS విభాగం లో మాత్రమే ఉంది ఇటువంటి సౌకర్యాలు కలిగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మమ్ములను ప్రోత్సాహం చేసే హెల్త్ మినిష్టర్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, DME, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ,  సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Author

Was this helpful?

Thanks for your feedback!