పూలచింత గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఉప్పొంగిన అభిమానం

పూలచింత గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఉప్పొంగిన అభిమానం

ఎమ్మిగనూరు, న్యూస్ వెలుగు;  ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం పూలచింత గ్రామంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ 2000 వేల మంది ఆధ్వర్యంలో మహా మేధావి, న్యాయ కోవిదుడు,వేగుచుక్క,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మొదటిగా పూలచింత గ్రామం ఊరి బయట నుండి జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులకు డప్పుల దరువుతో, బానసంచాలతో, పూలతో,ఊరు మొత్తం అంబేద్కర్ నినాదముతో పూల వర్షం కురిపించి,భారీ ర్యాలీ తిరిగి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి, జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మరియు మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు,పూలచింత గ్రామ సర్పంచ్ బండే గురు స్వామి, TDP SC సెల్ ఎమ్మిగనూరు నియోజకవర్గం అధ్యక్షులు మడ్రి దావీదు, పూలచింత మాజీ సర్పంచ్, రాజశేకర్ లు విగ్రహావిష్కరణ చేయడం జరిగింది.నేడు ఈ సందర్బంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేకుంటే భారతదేశమంత చీకటిగా ఉండేదని భారతదేశంలో వెలుగు కోసం కుటుంబాన్ని త్యాగం చేసుకున్నారని కొనియాడి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సహాయము వలన ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి కులాలుకు ఫలాలు వచ్చాయి.కనిపించిన దేవుని కొరకు ఎన్నో మొక్కలు మొక్కుతారు కనిపించే మానవ దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొరకు ఎన్నో మొక్కలు మొక్కాలని, త్యాగ ఉద్యమాలకు సిద్ధపడి రాజ్యాధికారం సాధించుకొని, రాబోయే రోజుల్లోనే అంబేద్కర్ విగ్రహం నిలబెట్టేది మేజర్ పంచాయతీ నందవరం గ్రామంలోనే. నందవరం గ్రామంలో కులవివక్షత, అంటరానితనం, రెండు గ్లాసులు పద్ధతి, అణిచివేత రోజు రోజుకు పెట్రేగిపోతుంది. ఇతర కులాలు ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు, కేసులు పెట్టిన, బానిస గోడలను బద్దలగొట్టి నిలువెత్తున జ్ఞానం అంబేద్కర్ విగ్రహం నిలబెట్టడం తద్యం. పూల చింత గ్రామంలో అంబేద్కర్ విగ్రహం నిలబెట్టడంతో ప్రతి గడప పండుగ చేసుకొని, అంబేద్కర్ అభిమానం అంతులేని ఆనందముతో పిల్లలు,యువత,పెద్దలు, మహిళలు, చిన్నారులు, జై భీమ్ MRPS రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ MRPS నాయకులకు వీర అభిమానం చాటారు. “పూలచింత గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి bc, మైనారిటీ, oc కులాలు, పూలచింత జై భీమ్ mrps నాయకులు ఎంతో సహకరించారు, ఈ గ్రామ ఆదర్శం ఇతర గ్రామాలు తీసుకోవాలి”. *ఇంత ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన జై భీమ్ MRPS రాష్ట్ర, జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీ సహకారంతో మరెన్నో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తానని మాట్లాడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!