
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ గా డా.కె.వెంకటేశ్వర్లు పదవి బాధ్యతలు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.వైద్యులు, పరిపాలన సిబ్బంది స్వాగతిస్తూ ఆయనను శాలువా వేసి పూల బోకే తో ఘనంగా సన్మానించారు అనంతరం ఈ ఆసుపత్రి లో మీకందరికీ కూడా నేను సుపరిచితుడేనని అన్నారు.విధులలో పారదర్శకంగా పనిచేయాలన్నారు.ఆసుపత్రి సెక్యూరిటీ మరియు శానిటేషన్ ముఖ్యంగా పలు విభాగాలలో పారిశుద్ధ్య పనులపై ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలన్నరు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనమందరం విధులలో అలసత్వం వహించకుండా సమయానికి కార్యాలయాలకు వెళ్లేలా చూసుకోవాలన్నారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించినందుకు పలువురు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పలువురు పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూల్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.చిట్టి నరసమ్మ, CTVS HOD, డా.ప్రభాకర రెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.శివ బాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, KMC ఏడి, శ్రీ.అనిల్ కుమార్ రెడ్డి,GGH AD, శ్రీ.రమేష్ బాబ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొనన్నారు.