రైతులకు చుక్కలు సర్వేయర్లకు కాసులు..!
రీ సర్వేలో లోపాల సవరణకు కల్లూరు మండల సర్వేయర్లు సొమ్ములు డిమాండ్
కల్లూరు, న్యూస్ వెలుగు: గత ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే రైతులకు చుక్కలు చూపిస్తుంటే కొంతమంది సర్వేయర్లకు కాసులు కురిపిస్తుంది గత ప్రభుత్వ హయాంలో సర్వే చేస్తున్నామంటూ వసులకు పాల్పడగా ప్రస్తుతం ఎల్పీ నంబర్ల సవరణ విడదీయడానికి అందిన కాడికి దండుకుంటున్నారు. కల్లూరు మండల రెవెన్యూ పరిధిలోని మండల సర్వేయర్లు మీరు భూ సర్వే కోసం దరఖాస్తు చేశారు కదా నాలుగు రోజుల్లో చేసేస్తాం ఈలోపు కొంత డబ్బులు ఇస్తే ఫైల్ మొదలు పెడతాం. లేదంటే చాలా సమయం పడుతుంది తర్వాత రైతులకు మొహం ముందే చెబుతున్నారు. మీ భూమి సర్వే పూర్తయింది దస్త్రాలు మండల కార్యాలయానికి వెళ్లాలి పై అధికారులు పని పూర్తి చేయాలంటే కొంత ఎంత కొంత ఇచ్చుకోవాలి కదండీ త్వరగా చూడండి ఇలా ఇలా కల్లూరు మండల రెవెన్యూ పరిధిలోని మండల సర్వేయర్లు రైతుల నుంచి అందులో కాడికి దోచుకుంటున్నారు.
సర్వేనంతరం వెబ్ ల్యాండ్ లో ఏర్పడిన భూమి తాలూకు ఎత్తుతగ్గులు ఎల్పి నంబర్లు సరిచేయడానికి విడదీయడానికి కొందరు సర్వేయర్లు నగదును డిమాండ్ చేస్తున్నట్లు మండలంలోని గ్రామాల ప్రజలు ఇటీవల జరిగిన రిసర్వే జరిగిన గ్రామాల రైతులు వాపోతున్నారు.
గత గత ప్రభుత్వ హయంలో జరిగిన రీ సర్వేలో భూమీ సరిహద్దులు విస్తీర్ణం మ్యుటేషన్, డివిజన్ పేర్లు సర్వే నంబర్లు రైతుల పేర్లు కొలతల్లో వ్యత్యాసం అంతర్జాలంలో నమోదు చేయకపోవడం పట్టా సబ్ డివిజన్ చేయక భూమి మొత్తం ఆ సర్వే నెంబర్లు ఉన్నదాని ఉన్నదాన్ని ఒకే రైతు పేరున చూపడం వంటి సమస్య అనేక సమస్యలు తలెత్తాయి వాటిని సరిదిద్దెందుకు ప్రాంతాన్ని బట్టి మూడు వేల నుంచి పదివేల వరకు డిమాండ్ చేస్తున్నారు రైతులకు సమస్యలు లేకుండా చేయాలని ప్రభుత్వం ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించిన సర్వేయర్లపై కలెక్టర్ కు ఎన్ని ఫిర్యాదులు చేసిన కల్లూరు మండల, గ్రామ సర్వేయర్లు కాసులు ఇవ్వనిదే పొలాలకి సర్వే చేయడానికి ముందుకు రాలేమని చెబుతుండడంతో మండల ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.