వాలంటీర్లు పోరాటానికి డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు

   వాలంటీర్లు పోరాటానికి డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు

న్యూస్  వెలుగు, కర్నూలు; వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాజు విహార్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లకు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం 10000 వేతనం ఇవ్వాలని, వెంటనే విధుల్లోకి తీసుకొని బకాయిలు ఉన్న జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్ష అన్ని విద్యార్థి యువజన సంఘాలు గ్రామ వార్డు వాలంటీర్లకు మద్దతుగా నిలువాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రెండు లక్షల అరవై వేలమంది గ్రామ వార్డు వాలంటీర్లకు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టాక్కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా నాయకులు అంజి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, నగర కార్యదర్శి సాయి ఉదయ్ మద్దతు తెలిపారు.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!