
డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రైతు సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే ఆనందంగా పండగ- ప్రభాకర్ రెడ్డి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పాట ఆట మాట కార్యక్రమాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారుల తో నాటికలు పాటలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉల్సాల గ్రామంలో కుల మతాలకతీతంగా ప్రజలందరూ ఐక్యంగా సంతోషంగా అందరూ కలిసి ఆనందంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం అభినందనీయమని తెలిపారు. ఈ గ్రామంలో రైతుల సమస్యలు వచ్చిన ప్రజల సమస్యలు వచ్చినా ఇక్కడున్నటువంటి విద్యార్థి యువజన సంఘం నాయకులు ముందుండి ఆ సమస్యల పరిష్కారం కోసం నిస్వార్ధంగా పనిచేయడం అభినందనీయమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల కష్టపడి పనిచేసినటువంటి రైతులకు వ్యవసాయ కూలీలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు ఎన్నికల్లో పుటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే సంక్రాత్రి పండగ సంతోషంగా ఆనందంగా జరుపుకునే వాళ్ళమని తెలిపారు గత ప్రభుత్వంలో 1750 కోట్ల లంచం తీసుకొని ఆదానితో సోలార్ ఒప్పందం చేసుకోవడం వల్ల ఈరోజు ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ భారాలకు కారణమైన సఖీ తో చేసుకున్న సోలార్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని అలాగే ప్రజలపై వేస్తున్న ద్రోచార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు .ఈ ప్రభుత్వం రోజు ఒకరిని ఒకరు పొగుడుకోవడం నిందించుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు ఎక్కడ జరిగిందని నిలదీశారు మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు. ఎక్కడ వేశారని ప్రశ్నించారు తల్లికి వందనం రైతు మిత్ర ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు ఇవన్నీ అమలు అవుతేనే ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా పండగని సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు. గ్రామాల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని శక్తులు బయలుదేరాయి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి కుల మతాలకు అతీతంగా గ్రామాలలోని ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉల్సాల గ్రామంలోని సాగు పొలం అంతా వర్షాధారంపైనే ఆధారపడి ఉందని రాబోయ కాలంలో సాగునీటి నీకు సాధించుకుందామని పిలుపునిచ్చారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ బాటలు అనే నినాదంతో డివైఎఫ్ఐ 1980 నుండి అనేక గ్రామాల్లో వీధుల్లో ఆటల పోటీలు పాటల పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు అందులో భాగంగానే ఉల్టాల గ్రామంలో ఈరోజు ముగ్గుల పోటీలు కులమతాలకు అతీతంగా అందరి మధ్యలో నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేస్తున్నామని తెలిపారు. నేడు దేశంలో డ్రగ్స్ మతోన్మాదం పెట్రేగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగము పేదరికము రోజురోజుకు పెరుగుతున్న ప్రభుత్వాలు వాటి పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆరోపించారు ఈ తరుణంలో ప్రజలందరము ఐక్యంగా ఉండి డ్రగ్స్ మతోన్మాదం పేదరికం నిరుద్యోగం అంతమయ్యే వరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు కే అరుణ జిల్లా నాయకులు శ్యామల ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సాయి ఉదయ్ మండల కార్యదర్శి అంజి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ గ్రామ కార్యదర్శి హరి కిషన్ రెడ్డి రైతు సంఘం గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.