ప్రతి రైతు యూనిక్ ఐడి నమోదు చేసుకోవాలి…

ప్రతి రైతు యూనిక్ ఐడి నమోదు చేసుకోవాలి…

మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్
యూనిక్ ఐడి నమోదును పర్యవేక్షించిన మండల వ్యవసాయ అధికారి
హోళగుంద,న్యూస్ వెలుగు;  ప్రతి రైతు తమ పరిధిలోని రైతు సేవ కేంద్రంలో యూనిక్ ఐ డి నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ అన్నారు. శుక్రవారం రైతు సేవా కేంద్రంలో రైతుల యూనిక్ ఐడి నమోదును మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ , ప్రతి రైతు సేవ కేంద్ర పరిధిలో ఉన్న ప్రతి రైతుకు కచ్చితంగా విశిష్ట సంఖ్యను (యూనిక్ ఐడి) నమోదు చేసుకోవాలని అన్నారు. రైతు గుర్తింపు కార్డు ఉంటేనే భవిష్యత్తులో పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, పురుగుమందులు,ఎరువులు, రైతుకు సబ్సిడీ పథకాలన్నీ లబ్ధి పొందగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు మణిశ్రీ నాయక్ , ఎంపీఈవోలు, నరసింహులు రైతులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!