
రహదారి భద్రత పై వాహదారులకు అవగాహన కల్పించండి
డిసెంబరు 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణ
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; రహదారి భద్రత పై వాహదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను
ఆదేశించారు.. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు-2025 కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులు, ప్రజలు, విద్యార్థులను భాగస్వామ్యం చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపకూడదని, మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రాష్ డ్రైవింగ్, అధిక వేగం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు డ్రైవింగ్ చేయడం ఎంతో ప్రమాదకరమని వాహనదారులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ను ధరించడం దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాలన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణించరాదని తెలియజేయాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు సంబంధించిన బ్లాక్ స్పాట్స్ గుర్తించి క్లియర్ చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అదనపు ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, ఉప రవాణా కమీషనర్ శాంతకుమారి, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.