
ప్రతి మనిషికి విద్య ఒక బ్రహ్మాస్త్రం
న్యూస్ వెలుగు గుంటూరు నాగార్జున వర్సిటీ : ప్రతి మనిషికి విద్య ఒక బ్రహ్మాస్త్రం అనీ విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ మెడి కల్ &ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఎమ్ టి.కృష్ణబాబు పిలుపునిచ్చారు.
పుస్తక రచయిత విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎమ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా తన సర్వీసులో ఎదురైన అనుభవాలు, అనేక రాష్ట్రాలలో జ్ఞాపకాలను విద్యార్థినీ విద్యార్థులతో పంచుకున్నారు. సామాజిక బాధ్యత, నైతిక విలువలు, విలువలతో కూడిన విద్యాభ్యాసం, కష్టపడే తత్వం , క్రమశిక్షణ, విద్య పట్ల విద్యా వ్యవస్థ పట్ల సముచిత భావం, గురువులపై గౌరవం వంటి లక్షణాలు ప్రతీ విద్యార్థి అలవర్చుకోవాలని ఆయన సూచించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి వి ఎన్ విష్ణు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఎ ఎన్ యు రెక్టార్ ఆచార్య కే రత్నషీలామణి, ఆర్ట్స్ కామర్స్ లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎమ్ సురేష్ కుమార్, తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బి ఎస్ ఎన్ దుర్గాప్రసాద్, విశ్రాంత ఐజి రవిచంద్ర గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఏలూరి ఫౌండేషన్ చైర్మన్ ఏలూరి ప్రసాదరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.