
మధ్యతరగతి బడ్జెట్ కాదు ఎన్నికల బడ్జెట్ : కొత్తూరు సత్యం
కర్నూలు, న్యూస్ వెలుగు; కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి చెందినవారికి ఊరట కాదని ఎన్నికల బడ్జెట్ అని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎనిమిదో సారి ప్రవేశపెట్టిన బడ్జెట్ వింతగా ఆశ్చర్యకరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పైకి మధ్యతరగతి బడ్జెట్ వారికి ఊరట అని చెప్పడం వెనుక అసలు దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎంతమంది ఉన్నారు.. ప్రభుత్వం తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్యతరగతి ప్రజల జేబులకు ఉపశమనం కలిగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రభుత్వ వ్యూహాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మధ్యతరగతి ప్రజలకు ప్రత్యక్ష పన్ను మినహాయింపు ఇవ్వడం కంటే పరోక్ష పన్ను రేట్లు తగ్గిస్తే డిమాండ్ ను పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలో 140 కోట్ల జనాభాలో కేవలం 9.5 కోట్ల మంది మాత్రమే పన్నులు దాఖలు చేస్తున్నారని ,వారిలో కూడా ఆరు కోట్ల మంది జీరో రిటర్న్లు దాఖలు చేస్తున్నారని, కేవలం 3.5 కోట్ల మందికి మాత్రమే పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్నారు . ఎన్నికల రాష్ట్రాల్లో ఉండటంతో మధ్యతరగతి వర్గాలకు ఆదాయపన్ను రాయితీ కల్పించే దిశగా ప్రభుత్వం ఇలా చేసిందని అనిపిస్తుందన్నారు. ప్రత్యక్ష పన్నుల్లో ఉపశమనం ఇవ్వాలని జిఎస్టి వసూళ్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి చెందడం కంటే ప్రైవేటీకరణకు పెద్దపీట వేసినట్లుగా అనిపిస్తుందని ఆయన తెలిపారు. ఉద్యోగుల వేతనాలలో మార్పు లేకపోవడం నిరుద్యోగం కారణాలతో కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. దిగువ ,పేద వర్గాల ఆదాయ మార్గాన్ని పెంచకుండా ఇలాంటి సంకుచిత చర్యల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశించినంత బడ్జెట్ కేటాయించకపోవడం బాధాకర విషయం అన్నారు. గత 8 సంవత్సరాలుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ వల్ల ప్రభుత్వానికి డబ్బుల వసూలు అయ్యాయి తప్ప అభివృద్ధి ఆశించినంత జరగలేదని ఈనాటికీ కేంద్రంపై ఆధారపడకుండా విదేశాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టమని ఆశించడం బాధాకర విషయం అన్నారు అభివృద్ధి భారతదేశం పొంది ఉంటే నిరుద్యోగం ఎందుకు పెరిగిందని ఆయన ప్రశ్నించారు


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar