నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భార‌త ఎన్నిక‌ల సంఘం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భార‌త ఎన్నిక‌ల సంఘం

న్యూస్ వెలుగు ఢిల్లీ :

ఓట‌ర్ల జాబితాల ఖ‌చ్చిత‌త్వాన్ని మ‌రింత‌గా మెరుగుపర‌చ‌డం, ఓటువేసే ప్ర‌క్రియ‌ను పౌరుల‌కు మ‌రింత సుల‌భ‌త‌రం చేసే ల‌క్ష్యంతో భార‌త ఎన్నిక‌ల‌ సంఘం మూడు కొత్త కార్య‌క్ర‌మాల‌కు నాంది పలికిన‌ట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ వెల్ల‌డించారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌లు డా.సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల స‌మ‌క్షంలో రాష్ట్రాల ముఖ్య ఎన్నిక‌ల అధికారుల‌తో ఈ ఏడాది మార్చి నెల‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ ఈ కొత్త కార్య‌క్ర‌మాల‌ను గురించి ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు.

దీనిప్ర‌కారం జ‌న‌న మ‌ర‌ణాల రిజిష్ట్రార్ జ‌న‌ర‌ల్ నుంచి న‌మోదైన మ‌ర‌ణాల‌కు సంబంధించిన మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో డేటాను ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకొనే అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌న్నారు.

🌀మూడు కొత్త కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఎన్నిక‌ల సంఘం

🌀 జనన మరణాల జాబితా ఆధారంగా మరణించిన ఓటర్ల వివరాలు అప్ డేట్

🌀 కొత్త డిజైన్ తో ఓటర్ సమాచార స్లిప్

🌀బి.ఎల్.ఓ.లకు ప్రామాణిక గుర్తింపు కార్డులు

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS