
అల్ ఇండియా గేజీట్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యుల ఎన్నిక
న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు: అల్ ఇండియా గేజీట్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్
సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నట్లు ఆర్ కే శ్రీనివాస్ తెలిపారు. అనంతపురంలో
నిర్వహించిన వనభోజనాల కార్యక్రమానికి వాల్మీకి గేజీట్టెడ్ అధికారులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అనంతపురంలో నిర్వహించిన వాల్మీకి వనభోజన కకార్యక్రమంలో
ఈ క్రింది సభ్యులను కార్యవర్గ సభ్యులుగా హాజరైన సభ్యులందరు ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గా నరహరి, వైస్ ప్రెసిడెంట్స్ గా వరప్రసాద్, వెంకటేశులు, డాక్టర్ శైలజ, జనరల్ సెక్రటరీ గా బాలమురళీకృష్ణ, ట్రెజరర్ గా నరేంద్ర, ఆర్గనైసింగ్ సెక్రటరీ గా సౌజన్య, ఈశ్వరయ్య,
జాయింట్ సెక్రటరీ గా భాస్కర్ నాయుడు, రెడ్డి. బాలాజీ, ఈసీ మెంబెర్స్ గా ఆర్ కె శ్రీనివాస్, కళావతి, మేఘనాత్, రవీంద్ర, శివమ్మ, అడ్వైసర్స్ గా ఈశ్వరయ్య, రాజేంద్ర ప్రసాద్, ఎన్ ఈశ్వరయ్య గార్లను ఎన్నుకోవడం జరిగిందని ఆర్ కే శ్రీనివాస్ తెలిపారు.