ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి ; సిపిఎం

ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి ; సిపిఎం

     తుగ్గలి విద్యుత్ సబ్స్టేషన్ లో వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: విద్యుత్ చార్జీల పెంపుదల లేదంటూనే ప్రజలపై ప్రభుత్వం భారాలు మోగుతూనే ఉందని,విద్యుత్ భారంను వెంటనే విరమించుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి శ్రీ రాములు పేర్కొన్నారు. శనివారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలో గల విద్యుత్ సబ్స్టేషన్ నందు సిపిఎం నాయకులు మండల కార్యదర్శి శ్రీరాములు,ఈశ్వరప్ప, నాగన్న తదితర నాయకులు పాల్గొని అధికారులకు వినతిపత్రం అందజేశారు.‌ 2025-26 సంవత్సరంలో విద్యుత్ చార్జీలు పెంపుదల లేదంటూనే సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై వేలాది కోట్ల రూపాయలు భారం ముందుగానే మోపిందని వారు తెలిపారు.భవిష్యత్తులో కూడా మరింతగా భారాలు మోపేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని వారు తెలిపారు.ప్రైవేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా ప్రైవేట్ సంస్థల నుండి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనాలను రూపొందిస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధానాలు కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ప్రజలపై విద్యుత్తు దరలు మోపుతుందని వారు తెలిపారు. కావున ప్రజలపై విద్యుత్ బారాలు మోపి విద్యుత్ చార్జీలు పెంపుదలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!