
శివ భక్తులకు మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ శాఖ సూచన
కర్నూలు, న్యూస్ వెలుగు; మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ కర్నూలు , నంద్యాల జిల్లాలలోని శైవ క్షేత్రాలను సందర్శించు భక్తులకు మరియు ఆలయ కార్యవర్గాలకు తెలియజేయడమేమనగా మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణాలలో ఫోకస్ లైట్లను మరియు ఆలయ అలంకరణకు వాడు డెకరేషన్ లైట్లకు విద్యుత్ సరఫరా అందించు వైర్లను ముందుగానే తనిఖీ చేసుకొని జాయింట్ లు లేకుండా ఉంచుకోవాలని అలాగే జనసమూహము ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మరియు వైర్లకు దూరంగా ఉండవలెనని అలాగే ఏదైనా ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉంటూ సమీప విద్యుత్ అధికారులకు గాని లేదా 1912 టోల్ ఫ్రీ నెంబర్ గాని తెలియపరచవలనని ఉమ్మడి జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ విభాగం పి నాగరాజు యాదవ్, ఉమ్మడి జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏం ఉమాపతి తెలియజేశారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar