
అర్హత కలిగిన వారు ఓటర్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలి
తహసిల్దార్ రమాదేవి
* ఓటర్ నమోదు క్యాంపెయిన్ పరిశీలించిన తహసిల్దార్.
* తుగ్గలి జడ్పీ హైస్కూల్ మధ్యాహ్న భోజన మెనూ పరిశీలించిన ఎమ్మార్వో.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి రెండు రోజులపాటు ఓటరు జాబితా నమోదు ప్రక్రియను కార్యక్రమాన్ని శనివారం రోజున ప్రారంభించారు.మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను తుగ్గలి తహసిల్దార్ రామాదేవి పరిశీలించారు.పోలింగ్ స్టేషన్ 108,109,110 మరియు 111 లలో ఓటర్ జాబితాను తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితా కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలియజేశారు.శని మరియు ఆదివారాలలో రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్వో తెలియజేశారు.అనంతరం తుగ్గలిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల యందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథక మెనూను పరిశీలించారు.మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆమె ఉపాధ్యాయులకు మరియు నిర్వాహకులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విఆర్ఓ నవీద్ పటేల్, వెల్ఫేర్ అసిస్టెంట్ మోహన్,వెటర్నరీ అసిస్టెంట్ వంశీ,డిజిటల్ అసిస్టెంట్ అశోక్,ఫిజికల్ డైరెక్టర్ చందు నాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.