
చికెన్ షాప్ ని తొలగించండి
హోళగుంద,న్యూస్ వెలుగు; మండల పరిధిలో నేరణికి గ్రామంలో శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహ మూర్తులు కూర్చోబెట్టే కట్టా పక్కన ఏర్పాటు చేసిన మాంసపు దుకాణాన్ని తొలగించాలని గ్రామస్తులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గోవిందులు వినంతీ పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద మాట్లాడుతూ హిందూ దేవాలయాల పవిత్రతకు భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరియు దేవాలయాల పవిత్రతను ఆదర్శంగా ప్రతిబింబించడమే కాకుండా ఆరాధకులకు సామరస్య వాతావరణాన్ని పెంపొందించాలన్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ప్రసాద్,వీరేష్,మల్లయ్య,జగదీష్,పవన్,గాలింగప్ప,చంద్రశేఖర్,సోము వీరప్ప,మరి వీర,గదిలింగ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda