
మాంసం దుకాణాన్ని తొలగించండి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో నేరణికి గ్రామంలో శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహ మూర్తులు కూర్చోబెట్టే కట్టా(శ్రీ ఆంజేయస్వామి దేవాలయం) పక్కన ఏర్పాటు చేసిన మాంసపు దుకాణాన్ని తొలగించాలని గ్రామస్తులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు సోమవారం తహసీల్దార్ సతీష్ కుమార్,ఎంపిడిఓ విజయ లలితకు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద మాట్లాడుతూ హిందూ దేవాలయాల పవిత్రతకు భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరియు దేవాలయాల పవిత్రతను ఆదర్శంగా ప్రతిబింబించడమే కాకుండా ఆరాధకులకు సామరస్య వాతావరణాన్ని పెంపొందించాలన్నారు.స్పందించిన తహసీల్దార్ సమస్య పై విచారణ జరుపుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు సోమప్ప,మల్లికార్జున,సుధాకర్,భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ప్రసాద్,వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.