
ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన ఎల్లార్తి దర్గా

 విద్యుత్ దీపాలతో అలంకరించిన ఎల్లార్తి షేక్షవలి,షాషావలి దర్గా.
విద్యుత్ దీపాలతో అలంకరించిన ఎల్లార్తి షేక్షవలి,షాషావలి దర్గా.
ఉరుసు ఉత్సవాలకు వచ్చే భక్తుల అన్ని ఏర్పాట్లు పూర్తి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఎల్లార్తి గ్రామంలో వెలసిన  రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన హాజరత్ షేక్షవలి సాహెబ్,హాజరత్ షాషావలి సాహెబ్ 362వ ఊరుసు ఉత్సవాలకు దర్గా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
*ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు నేటి నుంచి జరిగే దాదా వారి ఉరుసు ఉత్సవల్లో భాగంగా సర్పంచ్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర,తెలంగాణ ప్రాంతాల నుంచి ఉరుసు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామంలో విధి దీపాలు,భక్తులకు వసతులు,వాహనాలకు పార్కింగ్ స్థలం,త్రాగునీరు,మరుగు దొడ్లు వంటి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు యువనేత గిరి తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని.నేటి నుంచి జరిగే ఎల్లార్తి హజరత్ శేక్షవలి,షాషావలి దాదా ఉరుసు ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహిస్తాం.బాల నరసింహులు ఎస్ఐ హోళగుంద.భక్తిశ్రద్ధలతో ఉరుసు ఉత్సవాలు జరుపుకోవాలి.నేటి నుంచి జరిగే ఉరుసు ఉత్సవాలను భక్తులు సాంప్రదాయబద్ధంగా,భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి.


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda