వైభవంగా ఎల్లార్తి హాజరత్ శేక్షవలి,షాషావలి తాత ఉరుసు

వైభవంగా ఎల్లార్తి హాజరత్ శేక్షవలి,షాషావలి తాత ఉరుసు

భక్తులతో కిటకిటలాడిన హాజరత్ శేక్షవలి,షాషావలి దర్గా.
గంధం మూసిన ముతవల్లి నూర్ బాబా.
ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి.
పీఠాధిపతి నూర్ బాబా
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఎల్లార్తి గ్రామంలో వెలసిన,రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ హాజరత్ శేక్షవలి,షాషావలి తాత 362వ ఉరుసు ఉత్సవాలు సోమవారం సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి.ఉరుసు ఉత్సవానికి భక్తులు మన రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రలైన కర్ణాటక,తెలంగాణ,మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్త జనం ఉరుసు ఉత్సవాలకు పిల్ల,పాపలతో కలిసికట్టుగా తరలి వచ్చారు. తెల్లవారుజామున పూర్వ ముతవల్లి నూరు బాబా గంధాన్ని గ్రామ విధులు గుండా వేడుకగా దర్గాకు తీసుకువచ్చారు.ఉదయం నుంచి భక్తులు దర్గాలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ఫాతేహల్ నిర్వహించుకొని తమ తమ మొక్కుబడులను తీర్చుకున్నారు.దీంతో దర్గా ఆవరణం భక్తులతో కిటకిటలాడింది.ఉరుసు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగినట్లు వర్క్స్ బోర్డు అధికారులు,దర్గా పీఠాధిపతి నూర్ బాబా,దర్గా ఈఓ ఇమ్రాన్ తెలిపారు.ఈ సందర్భంగా పీఠాధిపతి నూర్ బాబా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవత్వాని అలవర్చుకుని,సన్మార్గంలో నడవాలని సూచించారు.తాత ఆశిస్సులతో ప్రశాంతమైన జీవనం గడపాలని భక్తులను ఆశీర్వదించారు.మరియు దర్గాకు వచ్చిన నిధులతో దర్గాకు వచ్చే భక్తులకు త్రాగునీటి,వసతి తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు దర్గాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు.నేడు జియారత్తో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయని మరియు ఉరుసు ఉత్సవాలకు వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు దర్గా ఈఓ ఇమ్రాన్,నాయకులు దర్గాప్ప,గిరి,మల్లికార్జున తెలియజేశారు.అదేవిధంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్ఐ బాల నరసింహులు సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!