ఫీల్డ్ అసిస్టెంట్ హత్య పట్ల నిరసనను వ్యక్తం చేసిన ఉపాధి కార్యాలయ సిబ్బంది

ఫీల్డ్ అసిస్టెంట్ హత్య పట్ల నిరసనను వ్యక్తం చేసిన ఉపాధి కార్యాలయ సిబ్బంది

    నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన సిబ్బంది

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని గల అరికెర గ్రామం నందు ఉపాధి హామీ పథక గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కురువ వీరన్న ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడంతో శనివారం రోజున ఉపాధి కార్యాలయానికి సంబంధించిన అధికారులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసనను వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక ఉపాధి హామీ కార్యాలయం నందు ఏపీఓ హేమ సుందర్,కార్యాలయం సి.ఓ లు,మండల టి.ఏ లు,మండల ఎఫ్.ఏ లు చొక్కాలకు నల్ల బ్యాడ్జీలను ధరించి కార్యాలయం బయటకు వచ్చి నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ కురవ వీరన్న హత్య చేయడం చాలా దారుణమని వారు తెలియజేశారు.ప్రభుత్వం తరఫున విధులు నిర్వహించే అధికారులకు మరియు సిబ్బందికు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు తెలియజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ ను దారుణంగా హత మార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.ముందు ముందు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలను తీసుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీవో హేమ సుందర్,టెక్నికల్ అసిస్టెంట్లు పరిదప్ప,రామకృష్ణ,చంద్రశేఖర్, జయరాముడు,కార్యాలయ సి.ఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పులికొండ,కవీంద్ర, బాలకృష్ణ,మల్లన్న, సీనియర్ మెటీలు మల్లయ్య,భీముడు మరియు ఉపాధి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!