
ఖాళీ అవుతున్న గ్రామాలు
ప్రజలు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస బాట
*మండలం నుంచి రోజుకు వందల సంఖ్యలో వలస బాట..
*ఉపాధి కూలీ గీటడం లేదు.
హొళగుంద న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా హొళగుంద మండల కేంద్రం నుంచి శనివారం వలస బండి కదిలింది. ప్రధానంగా గ్రామానికి చెందిన దాదాపు కూలీ పనుల కోసం తెలంగాణకు పిల్లపాపలతో పోటు కూటి కోసం పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లారు.ముఖ్యంగా ప్రభుత్వం గ్రామంలో ఉపాధి పనులు కల్పిస్తున్న….ఉపాధి పనుల నుంచి వచ్చిన కూలీ గీత్తుబాటు కావడంలేదని వలస బాదితులు తెలిపారు. దీంతో వలస బాట పడుతున్నట్లు వలస కూలీలు జే.పోతయ్య, జే.మల్లయ్య,రామ,హమాలీ వీరెశ్ తెలిపారు. పట్టణ ప్రాంతాలకు వెళ్తే కాస్త సంపాదించుకోవడానికి సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ పనులు మొదలవడంతో వలస వెళ్తున్నట్లు కూలీలు తెలిపారు. ప్రభుత్వం గ్రామాల్లో గిట్టుబాటు దగ్గ ఉపాధి కార్యక్రమాలు నిర్వహించి వలసలను అరికట్టాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఎమ్మెల్యేలు , మంత్రులు ఉన్న వలసల నివారణలో ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, పొట్ట కూటికోసం కర్నూలు జిల్లాలోని అనేక మందలు బొంబాయి , బెంగుళూరు , హైదరాబాదు, వంటి ప్రాంతాలకు వలసలు వెళ్ళే పరిస్థితి నెలకొని ఉందని బాదితలు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.