
ముగిసిన ధనుర్మాస పూజలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మండల ప్రజల ఆరాధ్యదైవం శ్రీ సిద్దేశ్వర స్వామి సన్నిధిలో ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ,సోదరుడు శివ శంకర్ గౌడ ఆధ్వర్యంలో మంగళవారం ధనుర్మాస పూజలు వైభవంగా ముగిశాయి.ఉదయం నుంచి స్వామి వారి సన్నిధిలో వేదపండితుల మంత్రోచరణల మధ్య స్వామి వారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం,కుంకుమార్చన, బిల్వార్చన,ఆకుపూజ,పెద్ద ఎత్తున స్వామివారిని పూలమాలలతో అలంకరించారు.ధనుర్మాస పూజలు చివరి రోజు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి తరలి వచ్చిన మొక్కుబడులు తీర్చుకున్నారు.అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ మాట్లాడుతూ ధనుర్మాస సందర్భంగా స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు ప్రతి రోజు తెల్లవారుజామున నిర్వహించే పూజలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ముగిసినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తనయుడు సిద్దార్థ్ గౌడ్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.