
బొందిమడుగుల గ్రామంలో పశుఆరోగ్య శిబిరం ఏర్పాటు
పశు ఆరోగ్య శిబిరంను ప్రారంభించిన అధికారులు,ప్రజా ప్రతినిధులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని బొందిమడుగుల గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గపు శాసనసభ సభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు బొందిమడుగుల గ్రామ సర్పంచ్ యండ చౌడప్ప,గ్రామ సర్పంచ్ సలహాదారులు సలీంద్ర ప్రతాప్ యాదవ్ నేతృత్వంలో పశువైద్యాధికారి డాక్టర్ వెంకటేష్,వారి మిత్ర బృందం మంగళవారం రోజున గ్రామంలోని రైతుల పశువులను పరిశీలించి పశువులకు ఆరోగ్య సంబంధమైన వైద్య సేవలు చేశారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ సలహాదారులు సలీంద్ర ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో గల ఆవులు, ఎద్దులు,గేదెలకు,గొర్రెలకు,మేకలు మొదలైన పశువులకు ఆరోగ్య సమస్యలకై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పశు వైద్య శిభిరాలను ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తుండడంతో బొందిమడుగుల గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం సంతోషమని ఆయన తెలియజేశారు.పశువుల అనారోగ్య సమస్యలకు వైద్యాధికారులు చికిత్సను అందిస్తారని ఆయన తెలియజేశారు. గ్రామంలోని సన్న జీవుల నట్టల నివారణకు మందులు టీకాలు వేసి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని సర్పంచ్ సలహాదారులు ప్రతాప్ యాదవ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పశు సంవర్ధక సహాయకులు దాదా కలెందర్ బాషా, రవితేజ,జెవివో ఆంజనేయులు,గోపాల మిత్ర పూలరంగడు,జయన్న,రాజ గోపాల్,వినయ్,గ్రామ ప్రజలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.