
పొగాకు సెజేషన్ మాన్పించు కేంద్రాలు ఏర్పాటు
కర్నూలు,న్యూస్ వెలుగు; దేశవ్యాప్తంగా పొగాకు రహిత యువత ప్రచారం 2.0 లో బాగంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పిలుపు మేరకు కర్నూలు మెడికల్ కాలేజ్ సైకియాట్రీ విభాగం,స్టేట్ క్యాన్సర్ సెంటర్ ల ఆధ్వర్యంలో రెండు పొగాకు సెజేషన్ మాన్పించు కేంద్రాలను అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ, మంగళవారం ప్రారంభించారు.దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్చ్యువల్ ద్వారా టోభాకో సెజేషన్ సెంటర్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మానసిక వైద్య విభాగాదిపతి ప్రొఫెసర్ డా. N నాగేశ్వర రావు, స్టేట్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ & రేడియో థెరపివిభాగపు ప్రొఫెసర్ డా.సి. యస్.కే.ప్రకాష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. గంగాధర్ నాయక్, డా సుమంత్, చంద్రశేఖర్ రెడ్డి,టోబాకో కంట్రోల్ ప్రోగ్రాం సైకాలజిస్ట్ చంద్రశేఖర్ సీనియర్ yరెసిడెంట్స్ డా.మౌనిక, డా. రోషిని మరియు pg విద్యార్థులు,మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.