
రూ.291.67 కోట్లతో నగరపాలక అంచనా బడ్జెట్
స్థాయి సంఘ సమావేశంలో ఆమోదం
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరపాలక సంస్థ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాల బడ్జెట్‌ను బుధవారం స్థాయి సంఘం ఆమోదించింది. నగరపాలక కార్యాలయంలో మేయర్ బి.వై. రామయ్య అధ్యక్షతన, స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. రూ.291.67 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేశారు. మొత్తం ఆదాయం రూ.363.99 కోట్లు, ఖర్చు రూ.201.22 కోట్లు, రెవెన్యూ ఆదాయం రూ.201.22 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.162.77 కోట్లు, మూలధన రాబడి రూ.138.69 కోట్లు, నికర మిగులు రూ.72.31 కోట్లుగా అంచనాలు తయారు చేశారు. అదేవిధంగా రెండు తీర్మానాలకు స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. అమృత్-2 పథకంలో భాగంగా 19వ వార్డులోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ పబ్లిక్ పార్కు, 45వ వార్డులోని టీచర్స్ కాలనీ పబ్లిక్ పార్కుల నిర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాలకు కేటాయించి, ఏడాది కాలానికి సంబంధించి ఒక్కొక్క పార్కుకు రూ.4.90 లక్షలు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. 200 మంది తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 17 నుండి ఈ ఏడాది జనవరి 31 నాటికి సంబంధించి, రూ.42.93 లక్షల వేతనాలు చెల్లింపునకు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, సభ్యులు జుబేర్, యూనూస్, క్రాంతి కుమార్, మిద్దె చిట్టమ్మ, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, అకౌంట్స్ అధికారి చుండి ప్రసాద్, ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓలు జునైద్, ఇశ్రాయోలు, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, ఎగ్జామినర్ సుబ్రమణ్యం, అకౌంట్స్ అధికారులు శబాన, మల్లికార్జున్, క్లర్క్ జి.ఎం. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ.