
పంటకోత ప్రయోగాలతో దిగుబడుల అంచన
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో మండల వ్యవసాయధికారి స్వాతి ఆదేశాల మేరకు గ్రామంలో పంట కోత ప్రయోగం నిర్వహించారు.
ఇందులో భాగంగా కొంత విస్తీర్ణం పొలాన్ని కోసి నూర్పిడి చేశారు. వచ్చిన ధాన్యాన్ని తూకం వేశారు. అనంతరం ఒక ఎకరా పొలాన్ని యూనిట్‌గా తీసుకొని కోసిన పంటను తూకం వేసి పరిశీలించగా ఎకరాకు 19.850 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. ఈ ప్రయోగం ద్వారా ఈ ప్రాంతంలో సాగు చేసిన పొలాల్లో వచ్చే సరాసరి దిగుబడిని లెక్కకడతామని నేషనల్ శాంపిల్ సర్వే అధికారి సాంబశివుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో వెంకటేశ్వర్లు ఇన్సూరెన్స్ అధికార ఎస్ ఖలీల్ అహ్మద్ మండల ఏఎస్ఓ అధికారి అరుణదేవి , ఎంపీఇఓ సుక్రనాయక్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!