రభి లో సాగు చేసిన పంటలను ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలి

రభి లో సాగు చేసిన పంటలను ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలి

కొలవలి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమము

పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు పంట బీమా చేసుకోవాలి. పంట నమోదు,పంట బీమా రెండు రైతుకు ధీమా వంటిది అన్న మండల వ్యవసాయ అధికారి.

ముద్దనూరు, న్యూస్ వెలుగు;  ముద్దనూరు మండలం కొలవలి రైతు సేవా కేంద్రం పరిధిలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలవలి గ్రామంలో సాగు చేసినటువంటి కంది,మినుము పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు సలహాలు అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా మినుము పంటలో పల్లాకు తెగులు సోకినటువంటి మొక్కలను గుర్తించి అటువంటి మొక్కలను సమూలంగా ఎరివేసి కాల్చివేయడం గాని పూడ్చి పెట్టడం గాని చేయాలని రైతులకు సూచించారు.అలాగే కంది పంట పూత,మరియు మొగ్గ దశలో ఉంది అని తెలిపారు.మారుకా పురుగు నివారణకు కోరాజిన్ అనే మందును 60 యమ్.యల్.ఒక ఎకరానికి మరియు 13.0.45 అనే ఎరువు పొటాషియం నైట్రేట్ ను లీటరు నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. రభి లో సాగు చేసిన ప్రతి పంటను తప్పనిసరిగా ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలి అని తెలిపారు.పంట నమోదు చేయించుకోవడం ప్రతి రైతు బాధ్యత అన్నారు.రభి లో సాగు చేసిన శనగ, వేరు శనగ, మినుము,ప్రొద్దు తిరుగుడు, నువ్వు మొదలగు పంటలకు పంట బీమా క్రింద ప్రీమియం కట్టి పంట ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని రైతులకు తెలిపారు. పంట బీమా చేసుకొనుటకు ఈ నెల 15 వ తేదీ చివరి అవకాశం అని అన్నారు.పంట బీమా రైతు కు ధీమా లాంటిది అని అన్నారు.తదుపరి పురుగు మందులు వాడకం లో తగు జాగ్రత్తలు మెళకువలు అలాగే అవగాహన రైతులకు కల్పించారు .ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకులు యస్.వెంకట రమణ,యన్.రామ సుంధర్ రెడ్డి, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!