ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించాలి..

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించాలి..

రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్..

కడప, న్యూస్ వెలుగు; స్థానిక కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంచార్జ్ డిఆర్ఓ శ్రీనివాసులు  వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ కడప జిల్లా వ్యాప్తంగా ఆయా డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కచ్చితంగా జీవో నెంబర్ 20 8-2-2001 ప్రకారం మండల హెడ్ క్వార్టర్ లో నివసించాలనే నిబంధన ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించకుండా 50 నుండి 30 కిలోమీటర్ల ట్రావెలింగ్ చేస్తూ సమయపాలన పాటించకుండా ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారని  వివరించారు, అదేవిధంగా 24 అవార్డ్స్ ఉండాల్సిన హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీరు కూడా కొంత మంది మండల హెడ్ క్వార్టర్లలో నివసించకపోవడం వల్ల ప్రజలు ఆఫీసుల దగ్గర కావలి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అట్లే నివసించకపోయినా నివసించినట్లు ఆయా పై అధికారులతో రెంట్ జీతాలు కూడా ప్రభుత్వంతో చెల్లించుకుంటూ అన్యాయాలకు పాల్పడుతూ వున్నారని ఇది చాలా దుర్మార్గమైన విషయమని సమాజం ఎటు వెళుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, జిల్లావ్యాప్తంగా ఆయా డిపార్ట్మెంటల్ లో పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించే విధంగా చర్యలు తీసుకొని నివసించకపోయినా నివసించినట్లు మోసం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి వారు తెలియజేశారు మండల హెడ్ క్వార్టర్ లో నివసించకపోవడం వల్ల ప్రజలకు సరైన టయ్యానికి అందుబాటులో లేకపోవడం అనేది జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్టేనని వారు విమర్శించారు తక్షణమే పైన తెలిపిన విషయాలపై పూర్తి స్థాయి లో విచారణ జరిపి చర్యలు తీసుకొని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించే విధంగా చేసి ప్రజలకు మేలు చేకూర్చాలని లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!