ప్రతి పేదవాడు ఉన్నత విద్యావంతుడవ్వాలి

ప్రతి పేదవాడు ఉన్నత విద్యావంతుడవ్వాలి

అబ్దుల్ కలాం పాఠశాలకు  వరాల జల్లులు

జిల్లా కలెక్టర్ రంజిత్ బాష

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రతి పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని, అబ్దుల్ కలాం స్ఫూర్తితో దేశాన్ని పునర్నిర్మించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అన్నారు. శనివారం కర్నూల్ నగరంలోని అబ్దుల్ కలాం మున్సిపల్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ఐదు కంప్యూటర్లను వెంటనే అందిస్తానని హామీ ఇచ్చారు. కాకుండా కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు ఆదేశాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వ్యాయామ ఉపాధ్యాయుడు లేడని నియమించాలని కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే అక్కడికక్కడే వ్యాయామ ఉపాధ్యాయుని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి విధుల్లోకి వస్తారని వివరించారు. అబ్దుల్ కలాం పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల అదనపు గదుల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని వాటిని సత్వరమే అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. విద్యార్థులతో కలివిడిగా మాట్లాడుతూ పాఠ్యాంశాలను చర్చించారు. బాగా చదివి రాణించాలని, భారతదేశ భవిష్యత్తు కితాబుని ఇచ్చారు.. పోటీ ప్రపంచంలో ఎలా రాణించాలో వారితో చర్చించారు. అర్థం చేసుకోవడానికి అనేక మార్గాలను వివరించారు. ఆయనతోపాటు జిల్లా విద్యాధికారి ఎస్ శ్యా మ్యూల్ పాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!