
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పిలుపు
కర్నూలు, న్యూస్ వెలుగు; కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి సోమవారం కర్నూల్, నంద్యాల ఉమ్మడి జిల్లాల డిసిసిలను కలుపుకొని నాయకుల, కార్యకర్తల సమీక్ష సమావేశం విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ నందు నంద్యాల జిల్లా డిసిసి లక్ష్మీ నరసింహ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి నాయకుల కార్యకర్తల సమావేశంలో పీసీసీ వైఎస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కోర్దినేషన్ సభ్యులు, అన్ని మండలాల అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు,బూత్ లెవెల్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,పార్టీ అభివృద్ధికి నడుంబిగించాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి టిడిపి ప్రభుత్వం గతంలో వైసిపి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి సేవలను, ఇచ్చినటువంటి పథకాలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వలేకపోతున్నాయని, ప్రజలకు మంచి పథకాలను మంచి పాలనను ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ,మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజలకు గాని రాష్ట్రానికి కానీ మేలు జరుగుతుందని ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ కోఆర్డినేషన్ మెంబర్స్ మండల స్థాయి, గ్రామస్థాయి, బూత్ లెవెల్ వారిగా కమిటీలను ఏర్పరిచి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీగా ముందుండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పోరాడాలని అట్టివారే నియోజకవర్గం కోఆర్డినేషన్ గా బాధ్యతలు తీసుకోవాలని వారు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో ఉన్ని గొర్ల జనార్ధన్, ఎమ్ ఎన్ సుబ్బు యాదవ్ , గార్లపాటి మద్దిలేటిస్వామి , తెలుగు విజయ్ కుమార్, వడ్డే రాజశేఖర్, గుండాల కిరణ్, సిక్కెం నాగరాజు, ఆర్ మల్లికార్జున, సి మధు, యాగంటి, యెదుల మధుసూదన్ రెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.