
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాంతాలలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ఏఐఎస్ఎఫ్ డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలోన స్థానిక జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్.ఐ.ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి.సోమన్న మాట్లాడుతూ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సప్లమెంటరీ విద్యార్థులకు అదేవిధంగా ఇప్పటివరకు పరీక్ష ఫీజు కట్టనటువంటి ఇంటర్ విద్యార్థులకు మరల అవకాశం ఇస్తున్నాం , చెబుతూ విద్యార్థుల మీద మరొక కుదిబండ మోపే విధంగా తయారయిందని అన్నారు .ఎందుకంటే పరీక్ష ఫీజు ఇప్పుడు ఎవరైతే చలానా తో చెల్లిస్తారో అందరికీ కూడా జిల్లా కేంద్రంలోనే ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అందులోనే వచ్చి పరీక్ష రాయాలని చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయమని ఎందుకంటే జిల్లాలు డివిడ్ అయినా కూడా చాలా జిల్లాలలో ఆర్ఐవో లు కూడా లేరని అయినా కూడా ఒక్కొక్క జిల్లా 200 కిలోమీటర్ల ప్రాంతాలలో విస్తరించి ఉందని కొన్ని ప్రాంతాలకు బస్సుల సౌకర్యం కూడా లేదు అని ఇటువంటి పరిస్థితులలో అక్కడ నుంచి జిల్లా కేంద్రానికి రావడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిని కర్నూలు విషయానికే వస్తే ఎక్కడో కర్ణాటక బార్డర్లో హోలగుంద మండలం , ఆలూరు కానీ అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు విద్యను అభ్యసిస్తా ఉన్నారని అక్కడ కూడా చాలామంది విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించారని ఆలూరు నియోజకవర్గం కానీ ఆదోని నియోజకవర్గం , మంత్రాలయం నియోజకవర్గం కానీ ఇలా అనేక నియోజకవర్గాలు కూడా కర్నూలు కేంద్రానికి దాదాపు 150 నుంచి 180 కిలోమీటర్ల దూరంలో న విస్తరించి ఉంధని అక్కడి నుంచి కర్నూలు కేంద్రానికి రావాలి అంటే విద్యార్థులు దాదాపు మూడు గంటల ప్రయాణం చేసి రావలసి వస్తుంది అని ఒకవేళ రాతిరే వచ్చి ఉండాలన్న, లాడ్జిలల్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉందని డబ్బులతోటే అక్కడ ఉండవలసిన పరిస్థితి వస్తా ఉందని దీంతో విద్యార్థుల విద్య మీద దృష్టి పెట్టలేరని నంద్యాల జిల్లా ఎక్కడో శ్రీశైలం నుంచి కూడా విద్యార్థులు వచ్చి నంద్యాలలో పరీక్షలు రాయాలంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అని ఒక్క రోజు అయితే ఏదో విద్యార్థులు రాసి వెళ్ళగలరని కానీ రెండు మూడు సప్లమెంటరీలు ఉన్నటువంటి పిల్లలు మూడు నాలుగు రోజులు లాడ్జిల్లాలో ఉండాలన్న డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి వస్తా ఉందని అమ్మాయిలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునేటువంటి పరిస్థితి వస్తుందని కావున విద్యార్థినిల మీద ఇంటర్మీడియట్ అధికారులు కొంచెం కనికరం చూపించాలని అన్నారు. ఇప్పుడు కూడా పరీక్ష ఫీజు డేట్ అయిపోలేదని ఇంటర్మీడియట్ అధికారులు అనుకుంటే ఇప్పటికైనా తక్షణమే ప్రాంతాలలో ఏర్పాటు చేయవచ్చు . తక్షణమే జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ఉమ్మడి జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టినటువంటి ప్రాంతాలలోనే వారికి పరీక్ష కేంద్రాలని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నగర సహాయ కార్యదర్శి మధు, నగర ఉపాధ్యక్షులు ప్రశాంత్ నగర కార్యవర్గ సభ్యులు చరణ్, విజయ్, సురేష్,అశోక్, తదితరులు పాల్గొన్నారు.