ఎగ్జిబిషన్ ధరలను నియంత్రించాలి
(PSYF,RSO)విద్యార్థి యువజన సంఘాల డిమాండ్
తాసిల్దార్ గంగయ్య కు వినతిపత్రం అందజేత
పొద్దుటూరు, న్యూస్ వెలుగు; స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం నందు విద్యార్థి యువజన సంఘాల (PSYF,RSO) ఆధ్వర్యంలో తాసిల్దార్ గంగయ్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి యువజన నాయకులు ఓబులేసు జగన్ లింగమయ్యలు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో గత సంవత్సరం అన్బిసెంట్ మున్సిపాలిటీ పాఠశాల ఆవరణం నందు ఏర్పాటుచేసే కన్యకా పరమేశ్వరి ఎగ్జిబిషన్ టికెట్ల ధరలు ఎంట్రన్స్ ఫీజు తినుబండారాల ధరలను పరిమితిగా ఉంచడం జరిగింది పోయిన సంవత్సరం ఎంట్రెన్స్ ఫీజు ఉచితంగా ఇవ్వడం జరిగింది అప్పటి కాంట్రాక్టర్ అలాగే ప్రభుత్వ ధరలను ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఆదాయం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అధిక ధరలతో వినోదం కోసం వచ్చే ప్రజలను దోపిడికి గురి చేయడం చాలా బాధాకరమైన విషయమని ఈ ఎగ్జిబిషన్ను కూడా ప్రభుత్వమే నిర్వహించాలని ప్రభుత్వ ధరల ప్రకారమే ప్రజలకు భారం కలిగించకుండా ఉండే రుసుములను ఏర్పాటు చేయాలని ఎగ్జిబిషన్ బయట నుండి లోపలి వరకు ధరలను కేటాయించి టెండర్లు నడిపే వ్యక్తులు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే సూచికలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ టెండర్ను రద్దుచేసి ప్రభుత్వ ఆధీనంలో నడపాలని ఎమ్మార్వో గారికి తెలియపరచడం జరిగింది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షించి ఈ టెండర్ను రద్దుపరిచి ప్రభుత్వ ఆధీనంలో నడపాలని అలాగే 45 రోజులపాటు సాగే ఈ ఎగ్జిబిషన్ను కుదించాలని దీనివల్ల అనిపిసెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులు అలాగే పక్కనే ఉన్న ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు అక్కడ ఇప్పుడు ఏర్పాటు చేసిన బిసి ప్రభుత్వ బాలికల కళాశాల చిన్నపిల్లల హాస్టల్ వసతి విద్యార్థులు పూర్తిగా దీనివల్ల డిస్టర్బ్ జరిగి ఇబ్బందులు పడే అవకాశం పొంచి ఉంది కావున ఈ ఎగ్జిబిషన్ను రద్దు పరచాలని లేదా మరొక చోటికి తరలించాలని విద్యార్థి యువజన సంఘాలుగా ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులను కోరడం జరుగుతోంది