నవోదయ లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

నవోదయ లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

ఎమ్మిగనూరు, న్యూస్ వెలుగు; ఎమ్మిగనూరు బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇంతకు మునుపు ఈనెల 19 వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు.ఇప్పుడు దీనిని ఈనెల 26 వరకు పొడిగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అర్హులైన విద్యార్థులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఇ.పద్మావతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025 ఫిబ్రవరి 8వ తేదీన ఎంపిక పరీక్ష ఉంటుందని వెల్లడించారు. 9వ తరగతి విద్యార్థులు https://navodaya.gov.in వెబ్‌ సైట్లో, 11వ తరగతి విద్యార్థులు https:// cbseitms.nic. in/2023 వెబ్‌ సైట్లో గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని కర్నూలు, నంద్యాల జిల్లాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

Author

Was this helpful?

Thanks for your feedback!