ఒక నేత్రదాత తో ఇద్దరికీ కంటి చూపు
గోనూరు యుగంధర్ శెట్టి
మానవతా ఐ డొనేషన్ కమిటీ చైర్మన్.
కర్నూలు, న్యూస్ వెలుగు; జనవరి 9 వ తేదీన స్థానిక వెంకటాద్రి నగర్ నందు* రామాయణం భ్రమరాంబా గారు 65 పరమపదించారు, వీరి భర్త సుధాకర్ కుమారులు సుజయ్ బాబు సుదర్శన్,కుమార్తె సునీత గారలకు మానవతా స్వచ్చంద సేవా సంస్థ ప్రెసిడెంటు
శోభన్ బాబు, ఐ డొనేషన్ కమిటీ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి నేత్ర దానం గురించి సభ్యులకు వివరించడం జరిగింది, వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు, వెంటనే కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐ బ్యాంక్ టెక్నీషియన్స్ నాగన్న ప్రదీప్ కు తెలపగా వారు వెంటనే వచ్చేసి నేత్రాలను తీసుకోవడం జరిగింది.
ఒకే వారంలో ఇద్దరి తో నేత్రదానాలు చేయించడం, గత 4. నెలలో 5. మంది నేత్రదానం చేయడం వలన 10.మందికి చూపు రావడం జరిగింది ఈ ప్రోగ్రాం చేస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి ప్రత్యేకమైన అభినందన తెలియజేశారు. నేడు, దృష్టి లోపం కారణంగా రోజువారీ జీవనంతో పోరాడుతున్న రోగులకు దృష్టిని పునరుద్ధరించడానికి వైద్య శాస్త్రం తగినంతగా అభివృద్ధి చెందింది. ప్రజలు మరణించిన తర్వాత కూడా నేత్రదానంతో ఇతరులకు సహాయం చేస్తున్నారు అని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు శోభన్ బాబు గారు చెప్పారు.మరణించిన వారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుండి ఫ్రీజర్ బాక్స్, వైకుంఠ రథం ఉచితంగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రెసిడెంట్ శోభన్ బాబు ఐ డొనేషన్ కమిటీ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి మెంబర్షిప్ డెవలప్మెంట్ చైర్మన్ పోలేపల్లి శేషయ్య, వైస్ ప్రెసిడెంట్ నాగేళ్ళహరి కిషన్, ప్రోగ్రాం కమిటీ కో చైర్మన్ మురళి మొదలు పాల్గొన్నారు